పదుల సంఖ్యలో క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్ భీకర దాడులతో గజాలలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడ ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందకుండా చేస్తే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. 14 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యుకె ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయిల్ అనుమతిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం