అర్జున్‌రెడ్డి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నా, యానిమల్ మూవీతో తానేంటో ప్యాన్ ఇండియా లెవల్లో ఢంకా భజాయించి చెప్పారు సందీప్ రెడ్డి వంగా. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలని చాలా మంది ఓపెన్‌గానే ఒపీనియన్ షేర్ చేసుకున్నారు.
యానిమల్‌కి విమర్శలు ఎన్ని వచ్చాయో, ప్రశంసలు కూడా అంతకు మించే వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ స్పిరిట్. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకోన్‌ని అనుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
కల్కిలో కనిపించిన ఈ కాంబోకి చాలా మంచి పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ అయింది. దాంతో, తాననుకున్న యాక్షన్ హీరోయిన్ రోల్‌కి ఆమె పక్కాగా సరిపోతారని అనుకున్నారట సందీప్.
కానీ, ఇప్పుడు దీపిక పెడుతున్న కండిషన్లు విని అవాక్కవుతున్నారట మేకర్స్. ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తా, అందులోనూ ఆరు గంటలే యాక్టివ్‌గా ఉంటా, నేనడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తీరాల్సిందేనంటూ పెద్ద లిస్టే వినిపించారట దీప్స్.
ఇన్ని కండిషన్స్ తో ఆమెను తీసుకుంటే, ప్రాజెక్ట్ అనుకున్నంత స్పీడుగా నడవదని భావిస్తున్నారట సందీప్. పైగా కింగ్ సినిమాతో కాల్షీట్ల క్లాష్ వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తోందట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్పిరిట్‌కి కొత్త లేడీని అప్రోచ్ కావాలనుకుంటోందట టీమ్.