ఇక ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ మూవీ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే విక్రమ్ ను సంప్రదించి స్టోరీ చెప్పాడని.. ఇక కథ నచ్చడంతో విక్రమ్ సైతం ఓకే చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్ చియాన్, డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింపుల్ శారీ అనుకోకండి.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
చెత్త సినిమా కోసం.. 700cr హిట్ సినిమా వదులుకుంది..
32ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి
జోరు మీదున్న జాన్వీ.. కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుందిగా
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్