కోవిడ్-19 మరోమారు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. 2019లో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి మరోమారు చాప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటకలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులో 9 నెలల శిశువు వైరస్ పాజిటివ్‌గా వచ్చింది.
బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కోవిడ్-19కు పాజిటివ్ నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మే 22న రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా శిశువుకు పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా తెలిపారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రస్తుతం బెంగళూరులోని కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించారు.
కర్నాటక ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2025 జనవరిలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు కేసులు వెలుగు చూశాయి. మే నెలలో మాత్రం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. మే 23వ తేదీ వరకు 33 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..