భారతదేశంలో ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పోస్ట్ పెయిడ్ సిమ్ వాడే గూగుల్ టెల్కో కస్టమర్లకు ఫ్రీగా గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వై-ఫై కస్టమర్‌లు అదనపు ఖర్చు లేకుండా ఆరు నెలల 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్‌ను యాక్సెస్ చేయగలరు. ఆరు నెలల వ్యవధి తర్వాత నెలకు రూ. 125 రుసుముతో ఈ సేవను కొనసాగించవచ్చు. వినియోగదారులు గూగుల్ వన్ సభ్యులుగా కొనసాగకూడదనుకుంటే సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారులకు డేటా నిల్వ సవాళ్లను తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త సేవను లాంచ్ చేస్తున్నట్లు భారతి ఎయిర్‌టెల్ ప్రతినిధులు చెబుతున్నారు.
వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, పత్రాలు, ఇతర డిజిటల్ కంటెంట్ కోసం ఇకపై 100 జీబీ వినియోగించుకునేలా ఎయిర్‌టెల్ చర్యలు తీసుకుంది. స్టార్టింగ్ ఆఫర్‌లో భాగంగా యాక్టివేషన్ తేదీ నుంచి మొదటి ఆరు నెలల వరకు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. ఈ సదుపాయంతో కస్టమర్‌లు తమ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్ సౌలభ్యాన్ని పొందవచ్చు. అలాగే కస్టమర్‌లు ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ చాట్‌లు గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌కి బ్యాకప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
అలాగే ఎయిర్‌టెల్ తన రూ.399 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సేవలను కూడా చేర్చడానికి అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్ ఇప్పటికే హై-స్పీడ్ ఇంటర్నెట్, డీటీహెచ్ వంటి సేవలు పొందవచ్చు. ఐపీటీవీ జోడింపుతో ఎయిర్‌టెల్ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వంటి 29 ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌ల నుంచి విస్తృత శ్రేణి ఆన్-డిమాండ్ షోలు, సినిమాలను ఆశ్వాదించవచ్చు. అంతేకాకుండా వినియోగదారులకు దాదాపు 600 ప్రముఖ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ అందిస్తున్నారు.