హర్యానాలోని గుర్గావ్‌లో 70 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. వృద్ధుడి పిత్తాశయం నుంచి 8,125 రాళ్లను బయటకు తీశారు. ఆపరేషన్ అయ్యాక రాళ్లను లెక్కపెట్టడానికి ఆరు గంటల సమయం పట్టింది. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యజమాన్యం తెలిపింది. వైద్యుల వివరాల ప్రకారం, వృద్ధుడు చాలా కాలంగా కడుపునొప్పి, జ్వరం, ఆకలి లేకపోవడం, బలహీనతతో బాధపడుతున్నాడు. తాజాగా అతనికి ఛాతీలో భారంగా అనిపించింది. దీంతో కుటుంబసభ్యులు మే12న పోర్టిస్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అప్పటికే అతడు విషమ సిత్థిలో ఉన్నాడు. వెంటనే వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా, అతడి పిత్తాశయం భారీగా ఉన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత ఇన్వేసివ్ లాపరోస్కోపిక్ సర్జరీ చేసి వృద్ధుడి పిత్తాశయంలో పేరుకుపోయిన వేలాది రాళ్లను తొలగించారు. శస్త్రచికిత్స దాదాపు గంటసేపు కొనసాగింది. వాటి లెక్కింపు ఆరు గంటలు జరిగింది. 8,125 రాళ్ల కేసు NCPR పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం తెలిపింది. పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయకపోతే, రాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ అమిత్ జావేద్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోగి నిర్లక్ష్యం కారణంగా రాళ్లు పెరిగాయని, ఇంకా ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. పిత్తాశయంలో చీము ఏర్పడటం ప్రారంభమవుతుందని, ఫైబ్రోసిస్ కూడా రావచ్చని అన్నారు. చాలా ఏళ్లపాటు పట్టించుకోకుండా ఉంటేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
శరీరంలో కొవ్వుల సమతస్థితి లోపించడం వల్ల పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయని, ఇది అరుదైన కేసుగా వర్ణించారు డా. అమిత్ జావేద్. దాని వల్ల పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల అబ్సర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేసారు.
Gurugram hospital doctors remove over 8000 gall bladder stones from 70-yr-old man
Read @ANI Story |https://t.co/Zuf2yQRZeZ#gurugram #gallbladder #stones #kidneystone #bizzare pic.twitter.com/Ncotn7mTXr
— ANI Digital (@ani_digital) May 22, 2025