Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

PM Modi: మారిషస్ పీఎం రామ్‌గులాంను ప్రశంసించిన ప్రధాని మోదీ.. భారత్‌కు రావాలంటూ ఆహ్వానం..

25 June 2025

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirupati Mother Collateral His Son,భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి.. రూపాయి, రూపాయి పోగేసుకుని వెళ్లేసరికి..! – tirupati boy left by mother as collateral killed in tamil nadu
ఆంధ్రప్రదేశ్

Tirupati Mother Collateral His Son,భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి.. రూపాయి, రూపాయి పోగేసుకుని వెళ్లేసరికి..! – tirupati boy left by mother as collateral killed in tamil nadu

.By .23 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirupati Mother Collateral His Son,భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి.. రూపాయి, రూపాయి పోగేసుకుని వెళ్లేసరికి..! – tirupati boy left by mother as collateral killed in tamil nadu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుపతి జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి నిస్సహాయత.. తనకు కొడుకును దూరం చేసింది. కట్టుకున్నవాడు దూరమై.. చేసిన అప్పులు భారమై పరిస్థితులలో విధిలేక ఆమె చేసిన పని.. పేగుబంధాన్ని దూరం చేసింది. చూసిన వారినే కాదు విన్నవారికే కూడా కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తిరుపతి జిల్లా చవటపాలెంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి
భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి (ఫోటోలు– Samayam Telugu)

భర్తే లోకమనుకుంది.. కొడుకే ప్రాణమనుకుంది.. కన్నోడు, కట్టుకున్నోడితో మూడు పూటలా భోజనం కోసం ఎండనకా, వాననకా కష్టపడింది. అయితే కాలం చిన్నచూపు చూసింది.. భర్తను దూరం చేసింది.. పెనిమిటి దూరం కావటంతో పేగు బంధమే ఇక తనకు అన్నీ అనుకుంది ఆ కన్నతల్లి. కానీ విధి మరోలా తలిచింది.. కట్టుకున్నోడిని దూరం చేసిన కాలం.. కడుపున పుట్టినవాడికి కూడా తనలో కలిపేసుకుంది. బతుకు పోరాటంలో విధిలేని పరిస్థితుల్లో పేగుబంధాన్ని తనఖా పెట్టిన ఆ కన్న తల్లి.. కొడుకును విడిపించుకోవాలనే ఆశతో డబ్బుతో వెళ్లేసరికి.. వినకూడని వార్తను వినాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తిరుపతి జిల్లా చవటపాలెం గ్రామం.. చెంచయ్య, అనకమ్మ అనే దంపతులు. సత్యవేడులోని ముత్తు అనే బాతుల పెంపకందారు వద్ద పనికి కుదిరారు. పదేళ్లు దాటిన తమ కొడుకుతో కలిసి ముత్తు వద్ద పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇద్దరూ కష్టపడితే మూడుపూటలా వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి. కష్టపడుతూ కలో గంజో తాగుతూ బతుకున్న వారి జీవితం అనుకోని మలుపులు తిరిగింది. చెంచయ్య అనుకోకుండా చనిపోయాడు. కుటుంబపెద్ద చనిపోవటంతో ఆ కుటుంబం రోడ్డుపడింది. ఇదే సందని కాచుకుని కూర్చున్న రాబందులు వారి జీవితంలోకి ప్రవేశించాయి. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి చెంచయ్య తన వద్ద రూ.25000 అప్పు తీసుకున్నాడని.. తీర్చకుండానే చనిపోయాడంటూ అనకమ్మతో గొడవకు దిగాడు. దీంతో మొగుడు పోయిన దుఃఖంలో ఉన్న అనకమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పు తీసుకున్నాడో లేదో చెప్పేందుకు కట్టుకున్నోడు లేడు.. తీర్చడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.. దిక్కుతోచని పరిస్థితి..

*సిట్టింగ్ రూమ్‌లు లేవని నడిరోడ్డుపైనే సిట్టింగ్..

భర్త చనిపోతే.. ఆదుకోవాల్సిన చేతులే, కాటేశాయ్..

అప్పుడే ముత్తు ఆదుకుంటానంటూ ముందుకు వచ్చాడు. అప్పటికే అనకమ్మ దంపతులు ముత్తు వద్ద ఏడాదిగా పనిచేస్తున్నారు. ఈ చొరవతో తాను ఆ డబ్బులు సర్దుబాటు చేస్తానంటూ ముత్తు అనకమ్మకు భరోసా ఇచ్చాడు. అయితే ఓ షరతు పెట్టాడు. అప్పు తీరేవరకూ అనకమ్మ తన వద్దే పనిచేయాలని షరతు విధించాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అనకమ్మ అందుకు అంగీకరించాల్సి వచ్చింది. అయితే ముత్తు వద్ద పనిచేయడం అనకమ్మకు రోజురోజుకూ కష్టంగా మారిపోయింది. దీనికి తోడు చాలీచాలని జీతం. దీంతో జీతం పెంచాలని కోరింది అనకమ్మ. అందుకు ముత్తు నిరాకరించాడు. అయితే తన వద్ద పనిచేయలేనని, వెళ్లిపోతానని కోరింది అనకమ్మ. అయితే తనకు రూ.45000 చెల్లిస్తే కానీ.. పంపడానికి ఒప్పుకోనని ముత్తు బెదిరించాడు.

*తిరుమలలో అపచారం.. బహిరంగంగా అలాంటి పనా?

అప్పు తీర్చేందుకు కొడుకును తనఖా పెట్టిన తల్లి..

అయితే అంత డబ్బు తన వద్ద లేకపోవటంతో అనకమ్మ.. తన కొడుకును ముత్తు వద్ద తనఖా పెట్టింది. అప్పటి నుంచి ముత్తు వద్ద ఉంటూ వస్తున్న అనకమ్మ కొడుకు.. అతని ఫోన్‌తో రోజూ తల్లికి ఫోన్ చేసేవాడు. రోజూ చాలా సేపు పనిచేయిస్తున్నారని, బాధలు పెడుతున్నారని.. తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ బతిమాలుకునేవాడు. కానీ కొడుకును విడిపించడానికి డబ్బులేని ఆ నిస్సహాయ తల్లి.. రేపు, మాపు అంటూ కాలం గడుపుతూ వచ్చింది. అయితే ఏప్రిల్ 15వ తేదీ అదే ఆఖరు.. అనకమ్మకు కొడుకు నుంచి ఫోన్ రాలేదు. ఏమైందోననే భయం. కొడుకును ఎలాగైనా విడిపించుకోవాలనే తపనతో రూపాయి రూపాయి పోగు చేసి రూ.45 వేలు జమ చేసింది అనకమ్మ.

*అరటిపండు ఆశ చూపించి.. ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి,

కొడుకును విడిపించుకోవాలని రూపాయి రూపాయి పోగుచేసుకుని వెళ్తే..

కొడుకును విడిపించుకోవాలనే తాపత్రయంతో డబ్బు పోగు చేసుకుని మే నెల మొదట్లో సత్యవేడులోని ముత్తు వద్దకు వెళ్లింది అనకమ్మ. డబ్బులు చెల్లిస్తానని కొడుకును అప్పగించాలని కోరింది. అయితే ముత్తు అనేక కథలు చెప్పాడు. ఓసారి అనకమ్మ కొడుకు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని.. మరోసారి వేరే చోటుకు వెళ్లాడని, ఇంకోసారి పారిపోయాడంటూ ముత్తు కట్టుకథలు చెప్పాడు. దీంతో భయపడిపోయిన అనకమ్మ పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకును తనకు అప్పగించేలా చూడాలని వేడుకుంది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఆశ్రయించింది.

ఆయన ఆదేశాల మేరకు పోలీసులు విచారించారు. చివరకు ముత్తును అదుపులోకి తీసుకుని విచారించగా.. అనకమ్మ కొడుకు చనిపోయిన విషయం బయటకు వచ్చింది. అనకమ్మ కొడుకును హత్య చేసిన ముత్తు.. ఎవరికీ తెలియకుండా తమిళనాడులోని కాంచీపురం సమీపంలో పూడ్చిపెట్డాడు. ఈ విషయాన్ని ముత్తు కూడా అంగీకరించాడు. దీంతో కొడుకును విడిపించుకోవాలనే కోటి ఆశలతో డబ్బులతో వచ్చిన అనకమ్మ.. గుండె పగిలే వార్తవని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం చూపరులకు కూడా కంటతడి తెప్పించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

AP Govt Gives Permission To Building For One Rupee,ఏపీలో పేదలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు! – andhra pradesh government on building rules 2025 and poor people house construction permission for one rupee

25 June 2025

Devineni Uma Maheswara Rao To Join In Ysrcp,వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా! – tdp leader devineni uma maheswara rao gives clarity on join in ysrcp

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

PM Modi: మారిషస్ పీఎం రామ్‌గులాంను ప్రశంసించిన ప్రధాని మోదీ.. భారత్‌కు రావాలంటూ ఆహ్వానం..

25 June 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మారిషస్ ప్రధాని రామ్‌గులంతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా, భారతదేశం – మారిషస్ మధ్య…

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

Rain Alert: ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

PM Modi: మారిషస్ పీఎం రామ్‌గులాంను ప్రశంసించిన ప్రధాని మోదీ.. భారత్‌కు రావాలంటూ ఆహ్వానం..

25 June 2025

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.