చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతూ ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా అడవి శేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ సినిమా గురించి అడవి శేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
రీసెంట్ గా అక్కినేని హీరో సుమంత్ నటించిన అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాజల్ చౌదరి హీరోయిన్గా నటించింది. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేశ్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో అడవి శేష్ గెస్ట్‌గా హాజరయ్యారు. ” నా ఫస్ట్ సినిమా ఈవెంట్‌కి సుమంత్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్‌కు నేను వచ్చాను..అనగనగా అనే సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదు ఈ సినిమా ఒక లైఫ్ అని అన్నారు అడవిశేష్. ఈ సినిమా ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతుంది..కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని శేష్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.