Gold And Silver Price In Hyderabad – Vijayawada: గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నెల క్రితం లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి.. ఈ క్రమంలోనే తగ్గిన బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. 95వేల వరకు దిగొచ్చిన బంగారం ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్ దాటాయి. బుధవారం రూ.2400 మేర పెరిగిన ధరలు.. తాజాగా.. శనివారం కూడా పెరిగాయి.. స్వచ్ఛమైన బంగారం పదిగ్రాములపై రూ.550 మేర ధర పెరిగింది.. పలు బులియన్ మార్కెట్‌లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములపై రూ.550 మేర ధర పెరిగి రూ.98,080 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 మేర పెరిగి రూ.89,900 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.100 మేర ధర తగ్గి.. రూ.99,900 లుగా ఉంది.
బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,900లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,10,900లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,900లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,230గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 90,050లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,080, 22 క్యారెట్ల ధర రూ.89,900 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,080, 22 క్యారెట్ల ధర రూ.89,900 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,080, 22 క్యారెట్ల ధర రూ.89,900 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..