ఛార్ ధామ్ యాత్ర నేపధ్యంలో భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. మరోవైపు కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు కొంతమంది ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. కేదార్‌నాథ్‌కు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ యాత్ర చేసే సమయంలో పొరపాటున కొన్ని వస్తువులను తీసుకుని వెళ్తే.. ఎటువంటి పుణ్యం లభించదు. సరికదా మీరు కేదార్ నాథుడిని దర్శనం చేసుకొకుండానే తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో మీ ఛార్ ధామ్ యాత్ర అసంపూర్ణంగా మిగిలి పోతుంది.
మాంసం, చేపలు, గుడ్లు
కేదార్‌నాథ్ యాత్ర ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర. కనుక మతపరమైన దృక్కోణంలో మాంసం, చేపలు, గుడ్ల వంటివి ఈ యాత్రను చేసే సమయంలో తీసుకెళ్లడం సముచితం కాదు. హిందూ మతంలో మతపరమైన ప్రదేశాలలో ఈ వస్తువులు నిషేధించబడ్డాయి.
ప్లాస్టిక్, పాలిథిన్ నిషేధం
కేదార్‌నాథ్ ఆలయం ప్రకృతి సౌందర్యానికి నిలయం. సమీపంలో మందాకిని నది, వాసుకి సరస్సు, చోర్బారి సరస్సు, గౌరీకుండ్ ఉన్నాయి. చుట్టుపక్కల హిమాలయ అందాలు ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తాయి. ఈ అందాన్ని కాపాడుకోవడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్లాస్టిక్, పాలిథిన్‌ను నిషేధించింది. కనుక ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులను తీసుకెళ్లవద్దు.
ఇవి కూడా చదవండి
మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాల వాడకం
కేదార్‌నాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో ఎవరైనా మద్యం లేదా మాదకద్రవ్యాలతో పట్టుబడితే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కనుక ఈ వస్తువులను మీతో తీసుకెళ్లడం మానుకోండి.
అనుమతి లేకుండా డ్రోన్లు
కేదార్‌నాథ్ ఆలయ సహజ సౌందర్యాన్ని చిత్రీకరించేందుకు చాలా మంది డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రభుత్వం డ్రోన్ల వాడకాన్ని కూడా నిషేధించింది. మీరు డ్రోన్ తీసుకెళ్తుంటే, ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అధికారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.
కేదార్‌నాథ్ యాత్ర కఠినమైన ప్రయాణం.
కేదార్‌నాథ్ యాత్ర కష్టతరమైన ప్రయాణం. ప్రయాణం సజావుగా సాగడానికి, అసౌకర్యాన్ని నివారించడానికి, అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండాలి. పర్వతారోహణ చేసే సమయంలో అనేక కిలోమీటర్లు నడవాలి. కనుక అనవసరమైన వస్తువులను తీసుకెళ్లవద్దు.
ఘాటు వాసన కలిగిన పరిమళ ద్రవ్యాలు
కేదార్‌నాథ్ బాబా ఆలయం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది. ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్న చోట. వారు ఇక్కడికి చేరుకున్న వెంటనే ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తారు. కనుక అత్యంత ఘాటు వాసన గల పరిమళ ద్రవ్యాలను మీతో తీసుకెళ్లకండి.
శబ్దం చేసే స్పీకర్‌లు
కేదార్‌నాథ్ యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర. ఇక్కడ శివయ్య భక్తులు తమ ప్రియమైన దేవుడిని పూజించడానికి భక్తిశ్రద్దలతో వెళతారు. అటువంటి సమయాల్లో శాంతిని కాపాడటానికి లౌడ్ స్పీకర్లను ఉపయోగించకుండా ఉండండి. ఇది ఇతరుల పూజకు, ప్రార్ధనకు ఆటంకం కలిగించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..