రాజస్థాన్ నడిబొడ్డున పాలి జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న జవాయి బేరా గ్రామాల్లో సుమారు 70 నుంచి 100 చిరుతపులులు నివసిస్తున్నాయి. ఈ గ్రామం వన్యప్రాణుల ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన, మనోహరమైన అనుభవాన్ని అందిస్తోంది. ఒక విశిష్టమైన సహజీవన కథను చాటుతోంది. బెరా గ్రామాలలో రాతి కొండలు, పొదలతో కూడిన అడవులు, బహిరంగ గడ్డి భూములతో నిండి ఉన్నాయి. ఈ గ్రామంలో చిరుతపులులు మానవులతో పాటు స్వేచ్ఛగా సంచరిస్తాయి. గ్రామస్తులు చిరుత పులలకు భయపడకుండా తమ రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ గ్రామం చిరుత ఆవాసానికి అనుగుణమైన వాతావరణ పరిస్తితులున్నాయి. దీంతో ఇక్కడ చిరుతలు యదేచ్చా ఆలయాల చుట్టూ, జనవాసాల్లో తిరుగుతుంటాయి. ఇదే ఈ గ్రామాన్ని మన దేశ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టింది.
బెర గ్రామంలో రబారీ తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు తమని తాము ఈ చిరుతలకు రక్షకులుగా భావిస్తారు. వాటిని గౌరవిస్తారు.. ఎటువంటి భయం వ్యక్తం చేయరు. ఒక్కోసారి చిరుతలు పశువులపై దాడి చేసి తీసుకుని వెళ్ళినా.. తాము నష్టపోయినా సరే గ్రామస్థులు సహనంతో వాటిని సహిస్తారు. ఇలా మృగాలైన చిరుతలతో కలిసి మనుషులు జీవించడానికి గల కారణం.. ఈ రబారీ ప్రజల సాంప్రదాయ నమ్మకాలు, ప్రకృతితో వీటికి ఉన్న అనుబంధం.
అనేక ఏళ్లుగా చిరుతలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చిరుతలు మనుషులపై దాడి చేసిన ఒక్క సంఘటన చోటు చేసుకోలేదు. చిరుత బారిన పడి మరణించిన సంఘటన జరగగక పోవడం చాలా మందికి ఆశ్చర్యకరంగా మారింది. మునుషులు క్రూర జంతువులు ఒకరితో ఒకరు కలిసి సామరస్యంగా జీవించవచ్చని నిరూపిన్నారు బెర గ్రామస్తులు. ప్రపంచంలోని ప్రజలకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చిరుతలు, మనుషులు కలిసి జీవించే ఈ ప్రత్యేకత పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ప్రకృతి పట్ల గౌరవం, వన్య జీవుల పట్ల ప్రేమ, సహనంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు అని నిరూపించిన ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి ఔత్సాహికులను ఆకట్టుకుంటుంది. ఈ అరుదైన సహజీవనాన్ని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు.
జవాయి బేరా గ్రామాల్లోని రాతి కొండలు చిరుతపులల జీవనానికి అనువైనవి. చిరుతలు ఆహారాన్ని వేటాడేందుకు అనువైన ప్రదేశాలున్నాయి. అంతేకాదు తల్లి చిరుత వేటకు వెళ్ళిన సమయంలో ఈ కొండలు పిల్లలకు ఆశ్రయం కల్పిస్తాయి. ఇక్కడ ఉన్న రాతి పర్వతాలు, పొద అడవులు చిరుతపులులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాదు చిరుత పిల్లలను పెంచడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న గడ్డి భూముల్లోని జింకలను, అడవి పంది, మేకలు, పశువులు, కుక్కలు వంటి వాటిని చిరుత పులులు ఆహారంగా తీసుకుంటాయి. చిరుతపులితో పాటు ఈ ప్రాంతంలో హైనాలు, స్లోత్ ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..