బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తారే జమీన్ పర్ ఒకటి. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. ఆమీర్ ఖాన్ ఇందులో నటించడంతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇప్పుడు చాలా ఎదిగిపోయారు. ఇక ఈ సినిమాలో ఆమిర్ తో పోటీ పడి నటించాదు దర్శిల్ సఫారీ. . ఈ సినిమాలో నటించేటప్పటికి అతనికి పదేళ్లు కూడా నిండలేదు. ఇప్పుడు ఆ బుడతడు హీరో మెటీరియల్ లోకి మారిపోయాడు. అయితే ఈ సినిమాలో అతని తల్లిపాత్రలో నటించిన నటి గుర్తుందా.?
తారే జమీన్ పర్ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సినిమాలో కొడుకుని హాస్టల్ లో దూరంగా ఉంచి ఆ తల్లిపడే వేదన ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. తారే జమీన్ పర్ సినిమా వచ్చి దాదాపు 17 ఏళ్లు దాటింది. ఆమె మాత్రం మరింత అందంగా మాదిరిపోయారు. 17 ఏళ్ళక్రితం తల్లిపాత్రలో నటించిన ఆమె ఇప్పుడు కుర్రహీరోయిన్స్ కు పోటీ ఇచ్చే రేంజ్ లో గ్లామరస్ గా మారిపోయారు.
ఆమె పేరు.. టిస్కా చోప్రా బాలీవుడ్ లో సహాయక నటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా సహాయక పాత్రల్లో ఆమె తన నటనతో మెప్పించింది. ఇటీవలే నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలోనూ నటించింది ఆమె.. హిట్ 3లో ఆమె కనిపించింది కొంతసేపే కానీ తన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అందాల తార చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వయసు పెరిగినా తరగని అందంతో కవ్విస్తుంది టిస్కా చోప్రా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.