స్నిగ్ద.. చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. స్నిగ్ద అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చుస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ద. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాం లో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ద ను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా అలా మొదలైంది సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. స్నిగ్ద కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ద.
చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లి కి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ద. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆమె టామ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా చేస్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక ఓ రీజన్ కూడా ఉంది. స్నిగ్ద పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది. ప్రతి ఏడాది శివమల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. గతంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్ స్నిగ్ద అమ్మాయా? అబ్బాయా.? అని ప్రశ్నను అడగగా..గట్టిగా సమాధానం ఇచ్చింది. నేను అమ్మయినే.. అబ్బాయిని కాదు నాకు ప్రతినెలా పీరియడ్స్ వస్తాయి. నేను ప్రతినెలా ప్యాడ్స్ కొనుకుంటాను. దాని తర్వాత మరి ఎందుకు అబ్బాయిలా తయారవుతారు.? అనే ప్రశ్నను అడిగింది. దానికి కూడా అదిరిపోయే సమాధానం ఇచ్చింది స్నిగ్ద. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. షర్ట్, ప్యాంట్ వేసుకుంటే నాకు కంఫర్ట్ గా ఉంటుందని తెలిపింది. అదేవిధంగా 43 ఏళ్లు వచ్చినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ.. ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. నా జీవితంలో ఆ సందర్భం కూడా రాలేదు. నేను పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకుంటే మనం మరొకరి కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.