Tirumala Devotee Rs 10 Lakhs Donation: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సంస్థ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం అందజేసింది. ఈ విరాళాలను పేదలకు అన్నదానం చేయడానికి వినియోగించాలని కోరారు. ఇంతకీ ఈ విరాళాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇంకా ఎవరెవరు విరాళాలు ఇచ్చారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
హైలైట్:
- తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం
- శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి
- బెంగళూరు భక్తుడు పెద్దమనుసుతో

తాజాగా మరో భక్తుడు తిరుమల శ్రీవారికి భారీగా విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు. బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ విరాళానికి చెందిన డీడీని తిరుమల అన్నమయ్య భవన్‌లోని సమావేశ మందిరంలో అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో అభినందించారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి పేదల ప్రాణాలను నిలబెడుతున్నారు.
తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత గొప్ప మనసు.. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు
మరోవైపు శుక్రవారం కూడా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చారు. ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి రూ.17 లక్షలు విరాళం డీడీని అందజేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఈ విరాళాన్ని భక్తులకు ఉపయోగించాలని దాత కోరారు.. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో అభినందించారు. తిరుమల శ్రీవారికి ఇటీవల కాలంలో భారీగా విరాళాలు అందుతున్నాయి.. టీటీడీ ట్రస్టులకు భక్తులు కొందరు రూ.కోట్లలో కూడా విరాళాలను అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా తెలియజేశారు.