
పై ఫొటోల్లో పద్ధతిగా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి ఫేమస్ హీరోయిన్. గతంలో పలు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసిందీ ఈ అందాల తార. అయితే ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిర పడిపోయింది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమల్లో బోల్డ్ యాక్ట్రెస్ గా గుర్తింపు ఉన్న నటీమణుల్లో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ముఖ్యంగా హిందీ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఈ బ్యూటీ తరచూ కనిపిస్తుంటుంది. అందంతో పాటు అభినయం పరంగానూ ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తరచూ తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఊరిస్తూ ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో బికినీ, స్విమ్ సూట్ ఫొటోలను పంచుకుంటూ ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ది బ్యూటిపుల్ శ్రేయా ధన్వంతరి. హైదరాబాద్ లో పుట్టిన ఆమె దుబాయ్ లో పెరిగింది. అయితే మళ్లీ ఇండియాకు వచ్చేసింది. వరంగల్ నిట్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది
మోడల్ గా కెరీర్ ఆరంభించిన శ్రేయ ధన్వంతరి తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. అక్కినేని నాగ చైతన్య నటించిన జోష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహగీతం సినిమాలో కూడా సెకెండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే వీటి తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.
శ్రేయ ధన్వంతరి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
హిందీలో లూప్ లపేటా, ముంబై డైరీస్ 26/11 వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది శ్రేయా ధన్వంతరి. అలాగే
ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 ఓటీటీ వెబ్ సిరీస్‌లు శ్రేయకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీసులోనూ శ్రేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే వీరిద్దరూ కలిసి నటించిన
చుప్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.