మామిడి పండ్లు తినని వేసవి కాలం అసంపూర్ణంగా అనిపిస్తుంది. మామిడి పండు రుచి అమోఘం కనుకనే దీనిని ‘పండ్ల రాజు’ అని కూడా పిలుస్తారు. తీపి, రసవంతమైన , సుగంధ ద్రవ్యాలతో కూడిన మామిడి పండ్లను అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు. మామిడి పండు తిన్న తర్వాత.. దీని టెంకను పనికిరానివిగా భావించి పడేస్తారు. అయితే ఈ మామిడి గింజతో ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో మీకు తెలుసా?
మామిడి టెంకలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మన శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మామిడి గింజలను చాలా సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ చికిత్సలను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. మామిడి టెంకల వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనకు తెలుసుకుందాం.. అపుడు వీటిని పారవేసే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
విరేచనాల నుంచి ఉపశమనం: మామిడి టెంకలను జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. విరేచనాలు, వాంతులు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు దీని పొడిని తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది పేగులను బలపరుస్తుంది. కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. దీని కోసం టెంకల్లోని జీడిని ఎండబెట్టి, దాని పొడిని తయారు చేసి.. చిటికెడు తేనెతో తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
కొలెస్ట్రాల్ తగ్గించడంలో: టెంకలోని జీడిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహాన్ని నియంత్రించడంలో: మామిడి టెంకలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే.. శరీరంలో చక్కెర శోషణను సమతుల్యం చేసే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
జుట్టు- చర్మానికి మేలు: మామిడి టెంకలతో తయారు చేసిన నూనె జుట్టుకు చాలా మంచిదని భావిస్తారు. ఇది జుట్టును మృదువుగా, బలంగా , మెరిసేలా చేస్తుంది. అదనంగా ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మం పొడిబారడం , చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. అంటే ఇది కొల్లాజెన్‌ను పెంచడానికి కూడా మంచి సహకరి. మామిడి టెంకల నుంచి తీసిన నూనెను జుట్టు, చర్మానికి మంచి రక్షణ.
బరువు తగ్గడంలో సహాయం: గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. దీని రెగ్యులర్ తీసుకోవడం వలన జీవక్రియను వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కూడా నిరోధిస్తుంది. కనుక మామిడి టెంకల పొడిని నీటిలో కలిపి త్రాగవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)