తమిళనాడులో రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను చూసి పొగిడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. శశికుమార్, సిమ్రన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. లేటెస్ట్ గా రాజమౌళి పెట్టిన ట్వీట్ సినిమా యూనిట్‌కి మరింత బూస్ట్ ఇచ్చింది.
అద్భుతమైన సినిమా చూశా. మనసును కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అభిషాన్ చాలా గొప్పగా డైరక్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో బెస్ట్ ఇదే.. మీరందరూ తప్పక చూడండీ అని తనదైన స్టైల్‌లో పోస్ట్ పెట్టారు రాజమౌళి.
ఎవరి సినిమాలనైనా ఆశ్చర్యపోతూ చూస్తానో, అలాంటి వ్యక్తి నా సినిమా గురించి మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను. ఆయన నా సినిమాను ప్రస్తావించి, ప్రశంసించే రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ డైరక్టర్ అభిషాన్ ఇచ్చిన రిప్లై కూడా ఆత్మీయంగా అనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.
ఆల్రెడీ తమిళనాడులో టూరిస్ట్ ఫ్యామిలీ టీమ్‌కి రజనీకాంత్ ప్రశంసలు అందాయి. శివకార్తికేయన్ స్పెషల్‌గా అభినందించారు. ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది టీమ్. 2 నెల 24న జపాన్ రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
టూరిస్ట్ ఫ్యామిలీ జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ కామెడి ఎంటర్టైనర్ మూవీని మీరు కూడా ఒక్కసారి చూడండి.