ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందడం ప్రతి భారతీయుడి కల అని అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది 140 కోట్ల మంది దేశప్రజల ఆకాంక్ష. మనం అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, అన్ని రాష్ట్రాలు టీమిండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదన్నారు ప్రధాని మోదీ.
ఢిల్లీలో నీతి ఆయోగ్ ముఖ్యమైన సమావేశం జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. దేశా అభివృద్ధి వేగాన్ని మనం పెంచాలని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేసి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి రాష్ట్రం ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఒక రాష్ట్రం: ఒక ప్రపంచ గమ్యస్థానం విధానం పర్యాటకాన్ని పెంచడమే కాకుండా సమీప నగరాల అభివృద్ధికి కూడా దారితీస్తుందన్నారు. భారతదేశం పట్టణీకరణ వైపు వేగంగా కదులుతోంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల కోసం మనం కృషి చేయాలి. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం మన నగరాల చోదక శక్తిగా మారాలని ప్రధాని మోదీ అన్నారు.
అందరి కళ్ళు నీతి ఆయోగ్ సమావేశంపైనే ఉన్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హారజు కాలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ సమావేశం ముగింపు ప్రసంగం చేస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి నిర్వహిస్తున్న మొదటి ప్రధాన సమావేశం ఇది. సాధారణంగా, పూర్తి కౌన్సిల్ సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం ఇది జూలై 27న జరిగింది.
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో స్వర్ణాంధ్రపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. ఏపీ ప్రతిపాదనలను ఇతర రాష్ట్రాలు పరిశీలించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని.. గూగుల్, AI టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమన్నారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌పై పలువురు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..