
ప్రస్తుతం డేటా ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతోన్న సంఘటనలు ఇటీవల ఎక్కువుతున్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్‌టెల్ కంపెనీకి చెందిన వేలాది మంది యూజర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎయిర్‌టెల్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ వార్తే ఆందోళన కలిగిస్తోంది. ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ కొనుగోలు చేసిన యూజర్ల డేటా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి.
యూకేకి చెందిన ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ డ్యూరెక్స్ ఇండియా నుంచి తన కస్టమర్ల ప్రైవేట్ సమాచారం లీక్ అయిందని తెలుస్తోంది. ఇదే విషయమై ఓ సెక్యూరిటీ రిసర్చర్ సౌరజీత్ మజుందార్ తెలిపారు. డ్యూరెక్స్ భారతీయ విభాగానికి చెంది కీలక సమాచారం లీక్ అయిందని తెలుస్తోంది. డ్యూరెక్స్ ఇండియా వెబ్‌సైట్‌లో కండోమ్స్ ఆర్డర్ చేసుకున్న వారి డేటా లీక్ అయినట్లు సమాచారం. వెబ్‌సైట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజీలో అథంటికేషన్ లోపించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఈ లోపాన్ని ఆసరగా చేసుకొని కొందరు వ్యక్తులు వెబ్ సైట్లోకి చొరబడి కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని సెక్యూరిటీ రీసర్చర్ తెలిపారు. కండోమ్స్ కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఇచ్చిన పేర్లు, మొబైల్ నంబర్‌లు, ఈ – మెయిల్, షిప్పింగ్ అడ్రస్, ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్, ఎంత మొత్తం చెల్లించారో తదితర వివరాలు లీక్ అయినట్లు సమాచారం. అయితే ఎంత మంది డేటా లీక్ అయ్యిందన్న విషయం వెల్లడించలేదు. దీంతో వినియోగదారులు ఆందోళనలో చెందుతున్నారు.
ఇదిలా ఉంటే సమస్యను పరిష్కరిచేంత వరకు డ్యూరెక్స్ ఇండియా ఈ విసయాన్ని రహస్యంగా ఉంచింది. డేటా లీక్ దొంగతనాలకు, వేధింపులకు కారణమయ్యే అవకాశాలు ఉండొచచని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన నివేదికను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియాకు తెలియజేశారు. మరి దీనిపై డ్యూరెక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..