హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో పాతబస్తీలోని హసన్ నగర్‌లోని మసీదు అహ్మద్-ఎ-ఖాటూన్ సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ దగ్గర కొండచిలువ కనిపించింది. స్నేక్ క్యాచర్ హకీమ్ మీర్ షకీల్ అలీ కొండచిలువను రెస్క్యూ చేసి అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఆవాసాలను కోల్పోయి నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గత సంవత్సరం, నగర శివార్లలోని అనేక గృహాలు, వ్యాపార కార్యాలయాలు, ఫ్యాక్టరీలోకి వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు కూడా భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో మీ ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తత అవసరం. ఈ సమయంలో.. హైదరాబాద్‌లోని మీ ఇంటికి పాములు, మొసళ్ళు లేదా మరేదైనా అడవి జంతువులు ప్రవేశిస్తే ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.
ఎవరైనా మొసలి వంటి వన్యప్రాణులను గుర్తించినట్లయితే, వారు తెలంగాణ అటవీ శాఖను 1800 425 5364 నంబర్‌లో సంప్రదించవచ్చు. పాముల విషయంలో.. స్థానిక స్నేక్ క్యాచర్స్ లేదా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి 8374233366 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఇతర వన్యప్రాణులు ఏవైనా దారి తప్పి మీ ప్రాంతాలకు వస్తే 9697887888 నంబర్‌కు కాల్ చేసి యానిమల్ వారియర్‌లకు చెప్పవచ్చు. వారు వచ్చి ఆయా జీవులను రెస్క్యూ చేస్తారు.
హైదరాబాద్‌లో వర్షాలు
ఆగస్టు 31 శనివారం… హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. షేక్‌పేట్, గోల్కొండ, బండ్లగూడ, మారేడ్‌పల్లి, ముషీరాబాద్, చింతల్‌మెట్, సైదాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో 60 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినందున, నగరంలో కొండచిలువలు సహా పాములు కనిపిస్తే పైన ఇచ్చిన నంబర్లకు కాల్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.