
ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
వైరల్ గా మారిన వీడియోలో ఓ యువకుడు పులిని చైన్ తో పట్టుకుని నడుస్తూ వస్తుంటాడు. కొంత దూరం వచ్చాక ఆగి దాని పక్కన కూర్చుంటాడు. ఇంత వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ జూపార్క్ సిబ్బందిలోని మరో వ్యక్తి ఆ పులిని కర్రతో కొడుతాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పులి యువకుడిపై దాడికి దిగింది. ఆ యువకుడు ప్రాణ భయంతో కేకలు వేశాడు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. చివరికి ఆ యువకుడు గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది.
Also Read: UN: ఐక్యరాజ్యసమితిలో “లేఆఫ్స్”.. 7000 ఉద్యోగాల తొలగింపు..!
ఈ ఘటనపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే వేటాడేస్తదని ఒకరు కామెంట్ చేశారు. పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో, పులితో ఫొటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు కానీ, ఆడుకోవాలని చూస్తే మాత్రం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమేనంటూ కామెంట్ చేస్తున్నారు.