మనల్ని ఇంటర్నెట్ ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి గూగుల్ ఖాతా కీలకం. దీని Gmail ఖాతా దాదాపు అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలు లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన వాటికి జోడించి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇమెయిల్ సర్వీస్ జీమెయిల్. మీలో చాలా మందికి Gmail ID ఉంటుంది. భారతదేశంలో సైబర్ భద్రత, గోప్యతకు సంబంధించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా దానిని హ్యాక్ చేస్తే, మీ గురించి దాదాపు ప్రతిదానికీ యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. దీంతో మీకు ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఎందుకంటే మీ జీమెయిల్ యాక్సెస్ పొందితే మీ పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Cylinder Price Hike: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
జీమెయిల్ ఖాతా భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మీ మెయిల్ అకౌంట్‌ను మరెవరైనా ఉపయోగిస్తున్నారో లేదో మీరు తెలుసుకోవాలి. గూగుల్ తన వినియోగదారులకు అలాంటి సదుపాయాన్ని అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఖాతాను మరెవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. మీ మెయిల్ ఐడీ ఎవరి వద్ద ఉంది? దానిని ఎవరు నియంత్రిస్తున్నారో మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
- ముందుగా మీరు మీ మెయిల్‌ను ఓపెన్ చేయాలి.
- తర్వాత మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
- దీని తర్వాత మీరు గూగుల్ అకౌంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఇక్కడ అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వీటన్నింటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే, మీ డివైజ్‌ల ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే, అన్ని డివైజ్‌లను నిర్వహించు అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మెయిల్ ఖాతా ఎక్కడ లాగిన్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ, మీరు మీది కాని ఏదైనా డివైజ్‌ను చూసినట్లయితే లేదా మీ అనుమతి లేకుండా మీ ఖాతా ఆ డివైజ్‌లోకి లాగిన్ అయి ఉంటే అటువంటి పరిస్థితిలో వెంటనే దాన్ని తొలగించండి. ఇది మీ Gmail ఖాతాను సురక్షితంగా ఉంచుతుంది. మీ జీమెయిల్ ఖాతా కోసం ఎల్లప్పుడూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సృష్టించండి.
పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు చిన్న అక్షరాలతో పాటు పెద్ద అక్షరాలను చేర్చాలి. పాస్‌వర్డ్‌లో చిన్న, పెద్ద అక్షరాలే కాకుండా సంఖ్యలు, చిహ్నాలు తదితరాలను కూడా జోడించాలి. దీంతో మీ ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు బ్రేక్ చేయడం కష్టతరం అవుతుంది.
ఉదాహరణకు..మీ పాస్ వర్డ్‌లో 4#3@d$fG%hJ*kL ఇలాంటివి స్ట్రాంగ్ అక్షరాలను చేర్చడం ముఖ్యం. password123 వంటి పదాలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఉందుకంటే మీ అకౌంట్ హ్యాక్ చేసేందుకు హ్యాకర్లకు మరింత సులభం.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో 5 స్టార్ సౌకర్యాలు.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి