వర్షాకాలంలో వజ్రాల కోసం ఎక్కువగా వెదుకుతుంటారు. వజ్రం దొరుకుతుందన్న ఆశతో స్థానికులే కాకుండా, దూరప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడే ఉంటూ గాలిస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం సమీపంలో కృష్ణానదికి ఇరుపక్కలా గోదావరి ప్రాంతంలో ఎత్తైన కొండలు ఉన్నాయి. వర్షాలు పడుతుండడంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. వర్షం కోసం ఎదురుచూసే చాతక పక్షిలా… వజ్రాల కోసం వారంతా రోజుల తరబడి శోధిస్తున్నారు. వజ్రం దొరుకుతుందన్న ఆశతో ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది అక్కడి గుట్టపై తవ్వుతున్నారు. వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కొంతమంది అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు, క్యాన్లల్లో తాగడానికి నీరు తీసుకుని వస్తున్నారు.. వజ్రాలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. వర్షం కురిసిన మరుసటి రోజు ఎక్కువ మంది వజ్రాల కోసం వెదుకుతుంటారు. ఎందుకంటే వర్షానికి మట్టి పైభాగం కొట్టుకుపోయి.. పొర కింద ఉండే వజ్రాలు బయటపడతాయి కాబట్టి. మట్టిని తవ్వుతూ నిశితంగా పరిశీలిస్తూ మెరుస్తున్న రాళ్లను, రంగురాళ్లను ఏరుతున్నారు. తెల్లారటం ఆలస్యం గాలింపులో నిమగ్నమైపోతున్నారు. చీకటి పడేంత వరకు ఏరుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది అక్కడే వంట చేసుకుంటున్నారు. ఇక్కడ ఏడాది పొడవునా పదుల సంఖ్యలో జనాలు రాళ్లు ఏరుతుంటారు. ఈ క్రమంలో గతంలో అనేక మందికి వజ్రాలు దొరికాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్ డి.. అధ్యయనాల్లో వెల్లడి
TOP 9 ET News: గూస్ బంప్స్ కాదు.. పిచ్చెక్కిస్తోన్న.. అఖండ2 యాక్షన్
బాబుది సింపుల్ టీషర్ట్ అనుకునేరు.. కొనాలంటే మన నెల జీతం కూడా సరిపోదు
నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!
ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం