ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ఇకపై ముందుకు తీసుకొచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వ్యవసాయ శాఖ …ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చెయ్యగా, జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు…అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా… వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వాస్తు, కందుల సాగు పెరిగింది, వరి సాగు స్థిరంగా కొనసాగుతుంది…
20 ఏళ్లల్లో 14 తుఫాన్లు
గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 14 తుఫాన్లను ఎదుర్కొంది… వీటిలో 5 తుఫాన్లు అక్టోబర్‌లో, 6 తుఫాన్లు నవంబర్‌లో, 3 తుఫాన్లు డిసెంబర్‌లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి… అక్టోబర్‌లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయి…
ఇవి కూడా చదవండి
ఇక నుంచి ఏటా 3 పంటలు
365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వ్యవసాయ శాఖ… ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలనేయోచనలో ఉంది ప్రభుత్వం… వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేసేలా చూస్తున్నారు… అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వాదిస్తున్నారు…దీనివల్ల భూసారం దెబ్బతింటోందని, అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించనున్నారు… వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చెయ్యనున్నారు…. ఇందులో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయి… వీటిని వినియోగించుకుని దిగుబడులు సాధించేదిసగా అడుగులు వేస్తున్నారు… అలాగే వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించనున్నారు…
వరి రైతు లాభపడేలా చర్యలు
వరి రైతుకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. వరిలో అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చెయ్యనున్నారు.. రైతుల పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా అవగాహన కల్పించనున్నారు… అవసరమైతే ఈ గట్లు నరేగా నిధులతో ఏర్పాటు చేయాలని అధికారులకునిప్పటికే ప్రభుత్వం ఆదేశించింది..అలాగే వరిపంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వాకల్చర్, హార్టీకల్చర్ సాగును కూడా అబివృద్ధి చెయ్యనున్నారు…
ఎరువుల వినియోగం తగ్గేలా ప్రణాళికలు
‘ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి… భూసారాన్ని కాపాడేందుకు కృషి చెయ్యనున్నారు…. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా … ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలి. రాష్ట్రంలో గత ఏడాది అందుబాటులో ఉండేలా చూడనున్నారు.. 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని. పల్సెస్, మిల్లెట్స్ సాగు పెరగాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది ప్రభుత్వం… ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వనుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..