అమరావతి మహిళలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మూర్ఖుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో షర్మిల విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందన్న వైఎస్ షర్మిల.. సజ్జల భార్గవ్‌రెడ్డి సోషల్ మీడియా ద్వారా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయిన తనపై కూడా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కుమార్తె, మహిళ అని కూడా చూడకుండా కించపరిచారన్నారు. జగన్ అందరినీ అక్కాచెల్లెళ్లని అంటారని కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
YS Sharmila on Sajjala: వైఎస్ఆర్ బిడ్డనైన నన్ను కూడా విడిచిపెట్టలేదు..
.