Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇలా అయితే డైరెక్టుగా యమపురికే.. యమధర్మరాజులా మారిన పోలీస్.. వీడియో చూశారా…

18 January 2026

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt To Distribute Provisions To Flood Victims,ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm chandrababu ordered to distribute daily provisions to flood victims
ఆంధ్రప్రదేశ్

Ap Govt To Distribute Provisions To Flood Victims,ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm chandrababu ordered to distribute daily provisions to flood victims

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt To Distribute Provisions To Flood Victims,ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm chandrababu ordered to distribute daily provisions to flood victims
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. వరదలు, వర్షాలతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తుందన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. వరద బాధితులకు ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని.. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని.. శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు.. ప్రతి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని సూచించారు. .

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి అలర్ట్ చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించాలి అన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయని.. వాటితో వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పారిశుద్ధ్య పనులు మొదలు పెడతామంటున్నారు అధికారులు. అంతేకాదు ఈ వరదలో మునిగిపోయిన బైకులు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పాడయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ వాహనాలకు బీమా చెల్లింపుపై ప్రభుత్వం తరఫున బుధ, గురువారాల్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు పండ్లు, నీరు, ఆహారాన్ని విసిరేయకుండా.. గౌరవప్రదంగా చేతికి అందించాలని సూచనలు చేశారు. మరోవైపు వరద సహాయ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. విద్యుత్తుశాఖ తరపున రూ.20లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు సాయం చేసేందుకు డిజిటల్‌ పేమెంట్, క్యూఆర్‌ కోడ్‌ విధానం కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan

18 January 2026

Andhra News: వక్క కాయలపై అందమైన చిత్రాలు.. ఆక్టటుకుంటున్న స్టాల్ బొమ్మలు

18 January 2026

Farmerchat App,రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎరువు ఎప్పుడు వేయాలి, నీళ్లెప్పుడు పెట్టాలి.. అన్నీ చెప్పేస్తుంది.. – government introduced farmerchat app for farmers in agriculture

18 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇలా అయితే డైరెక్టుగా యమపురికే.. యమధర్మరాజులా మారిన పోలీస్.. వీడియో చూశారా…

18 January 2026

రోడ్డూ ప్రమాదాల నివారణకు పోలీసులు రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, రీల్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు…

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026

Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

18 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇలా అయితే డైరెక్టుగా యమపురికే.. యమధర్మరాజులా మారిన పోలీస్.. వీడియో చూశారా…

18 January 2026

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.