నైరుతి రుతుపవనాల విస్తరణ, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి , తేమ – అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
రాయలసీమ:-
బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..