కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ధనుష్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో.. ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, ధనుష్, హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇదివరకే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే హైదరాబాద్ లో కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అలాగే చెన్నైలో నిర్వహించిన వేడుకలో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ మాట్లాడుతూ.. తనను మాస్ కమర్షియల్ చేయాలని కొందరు సలహాలు ఇచ్చారని.. మరికొందరు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని చెప్పారని అన్నారు.
ఎవరికి నచ్చినట్లు వాళ్లు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని.. కానీ తన నుంచి ఎప్పుడూ ఏ రకమైన సినిమా అయినా రావచ్చని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. “కోవిడ్ టైంలో ది గ్రే మ్యాన్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు కుబేర కథ చెప్పారు. వీడియో కాల్ లోనే 20 నిమిషాలపాటు స్టోరీ చెప్పారు. కథ నచ్చడంతో చేద్దాం అని చెప్పాను. రెండేళ్లలో కథను సిద్ధం చేశారు. స్క్రీన్ ప్లే సమయంలో మరోసారి నాకు కథ చెప్పారు. శేఖర్ కమ్ముల గురించి నాకు తెలియదు. కానీ ఎవరికి చెప్పినా శేఖర్ కమ్ములా వావ్ అంటూ భయంకరమైన బిల్డప్ ఇచ్చారు. స్క్రిప్ట్ సూపర్ గా ఉందని.. పెద్ద డైరెక్టర్ అని నమ్మినందుకు తిరుపతి నడిరోడ్డులో అమ్మా అమ్మా అంటూ బిక్షం అడుక్కునేలా చేశారు ” అంటూ నవ్వుతూ అన్నారు ధనుష్. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు.
ఇవి కూడా చదవండి
చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ధనుష్ బెగ్గర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దాదాపు 3 గంటల నిడివితో ఉన్నట్లు సమాచారం. అమిగోస్ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ధనుష్ కామెంట్స్..
“Shekhar has narrated #Kuberaa story for 20 mins in Video call. He did screenplay for 2 Yrs. All given Buildup for director📈. When I went for Shoot Tirupathi Adivarathula, Nadu Road la, Uchi Veyil la, Amma Thaye nu Pitchai eduka vittutaru😂”– #Dhanush pic.twitter.com/S4mvIP0Ftw
— AmuthaBharathi (@CinemaWithAB) June 17, 2025
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..