దక్షిణాది చిత్రపరిశ్రమను శాసించిన హీరోయిన్. చూడచక్కని రూపం.. సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో ఇండస్ట్రీని ఏలేసిన ఆమె చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది. కానీ తమ ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో వీరి బంధం పెళ్లి వరకు చేరలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దీంతో కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాడింది. చివరకు మరణించే ముందు కోట్ల ఆస్తులను పేద విద్యార్థులకు దానం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే సీనియర్ హీరో శ్రీవిధ్య. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీతో సహా అనేక భాషా చిత్రాలలో నటించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్.
శ్రీవిద్య 1953లో చెన్నైలో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. దీంతో చిన్నప్పుడే సంగీతం నేర్చుకుంది. చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకుంది. కానీ కుటుంబంలోని ఆర్థిక సమస్యతో చదువును మధ్యలోనే ఆపేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. 14 సంవత్సరాల వయస్సులో 1966లో శివాజీ నటించిన ‘తిరువరుత్సల్వర్’ చిత్రంతో బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 1969లో ‘చతురంగం’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసింది శ్రీవిధ్య. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడిగా కనిపించి మెప్పించింది. తెలుగుతోపాటు వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి బంధానికి శ్రీవిధ్య తల్లి ఒప్పుకోలేదు. దీంతో కమల్ హాసన్, శ్రీవిధ్య ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత ఆమె చిత్ర సహయ దర్శకుడు జార్జ్ థామస్ ను వివాహం చేసుకుంది. కానీ ఆమె వైవాహిక జీవితం అంత సంతోషంగా సాగలేదు. తన భర్త కోసం క్రైస్తవ మతంలోకి మారిపోయింది. అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉండిపోయింది. కానీ ఆమెను నటించాలని.. డబ్బు సంపాదించాలని భర్త టార్చర్ చేశారు. అలాగే ఆమెకు మూడుసార్లు గర్భస్రావం చేయించుకోవాలని వేధించారట. జార్జ్ తనను డబ్బు సంపాదించే యంత్రంగా భావిస్తున్నాడని శ్రీవిద్య గ్రహించి అతనికి విడాకులు ఇచ్చారు శ్రీవిధ్య. 1980లో తన భర్త జార్జ్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. 2003లో ఆమెకు వెన్నెముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో కొన్నాళ్లపాటు అనారోగ్య సమస్యలతో బాధపడింది. తన ఆస్తులను పేద విద్యార్థులకు ఇస్తున్నట్లు వీలునామా రాసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో కన్నుమూసింది శ్రీవిద్య.

Srividya. New
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..