అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 12న 242 మందితో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది.. విమానంలో ఉన్న ఒకరు తప్ప మిగిలిన వారందరూ మరణించారు.. అంతేకాకుండా.. హాస్టల్ భవనంపై కూలడంతో దాదాపు 38 మంది మెడికోలు మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.. అయితే.. ఈ అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.. మొత్తం ఏవియేషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమనే షాక్‌లోకి నెట్టింది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్‌లలో ఒకటి.. నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిమ్ లు 475 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ.4,091 కోట్లు.. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావొచ్చని అంటున్నారు నిపుణులు..
విమానం బీమాతో పాటు.. ప్రయాణికులు కొనుగోలు చేసిన వ్యక్తిగత ప్రమాద బీమాలు, క్రెడిట్ కార్డ్ బీమాలు, ఓవర్సీస్ ట్రావెల్ బీమాలు, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన లాంటి పథకాలు కూడా ఈ మొత్తం క్లెయిమ్‌లలో భాగంగా ఉంటాయని జనరల్ ఇన్స్యూరెన్స్ సీఎండీ రామస్వామి నారాయణన్ తెలిపారు. తాము వేసిన అంచనాల ప్రకారం.. విమాన నష్టం సుమారు 125 మిలియన్ డాలర్లు సుమారు రూ. వెయ్యి కోట్లు ఉంటుందని రామస్వామి నారాయణన్ తెలిపారు. ప్రయాణికుల బాధ్యత, థర్డ్ పార్టీ బాధ్యత, అమల్లో ఉన్న ఇతర వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్‌లు, ట్రావెల్ పాలసీల కారణంగా వచ్చే బాధ్యత క్లెయిమ్‌లు 350 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3 వేల కోట్లు అవుతాయని రామస్వామి నారాయణన్ వెల్లడించారు.
ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా కలిసి విమానం అసలు ఖరీదు కంటే దాదాపు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..