యూపీలోని లక్నోలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గోమతినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో నడిరోడ్డపై ఓ యువతీ యువకుడు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. యువతి, యువకుడు గొడవ పడుతూ రోడ్డుపైనే ఒకరిపైఒకరు తీవ్రంగా కొట్టుకున్నారు. వారి ఘర్షణనంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వారు ఎందుకు కొట్టుకున్నారు? గొడవకు గల కారణాలేంటి? అనేది మాత్రం తెలియరాలేదు. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యాఖ్యానించారు.