గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ.. ఈ రెండు డ్రింక్స్ లో క్యాలరీలు తక్కువ. ఇవి శరీరానికి త్వరగా శక్తిని ఇస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం పెంచి కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.
గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కెఫిన్, కేటెచిన్స్ అనే పదార్థాలు కొవ్వును కరిగించే పనిని వేగవంతం చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంలో స్పష్టమైన మార్పులు వస్తాయి.
ఇది బరువు తగ్గించడమే కాదు.. డయాబెటిస్, గుండె జబ్బులు, నిద్రలేమి లాంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అల్జీమర్స్, మెదడు సంబంధిత వ్యాధుల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
బ్లాక్ కాఫీ కూడా గ్రీన్ టీ లాగానే క్యాలరీలు తక్కువగా ఉండే త్వరగా శక్తిని ఇచ్చే డ్రింక్. ఇందులో కూడా కెఫిన్ ఉంటుంది. కాబట్టి మెటబాలిజం వేగంగా జరిగి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే ఇది ఆకలిని తగ్గించి ఎక్కువగా తినకుండా ఆపుతుంది.
బ్లాక్ కాఫీలో విటమిన్ B2, B3, B5, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఈ రెండు డ్రింక్ లు కూడా బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అయితే మేలు చేసే పదార్థాల పరంగా గ్రీన్ టీ మరింత ఆరోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఆకుల్లో సహజమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ శరీరంపై సున్నితంగా పని చేస్తుంది.
ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా.. రోజుకు 2 కప్పులకు మించి తాగకూడదు. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, గుండెపై ఒత్తిడి, అజీర్ణం లాంటి సమస్యలు రావచ్చు.
ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ లేక బ్లాక్ కాఫీ తాగడం మంచిది. కానీ భోజనం తర్వాత తాగితే జీర్ణంపై ప్రభావం చూపవచ్చు. అలాగే రాత్రిపూట కెఫిన్ ఎక్కువగా ఉండే ఈ డ్రింక్ లు నిద్రలేమికి కారణం కావచ్చు. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత వీటిని తీసుకోకపోవడం ఉత్తమం.
బరువు తగ్గడంలో గ్రీన్ టీ బ్లాక్ కాఫీ రెండూ మంచి ఎంపికలే. అయితే వాటితో పాటు వ్యాయామం, సరైన ఆహారం, సరిపడా నిద్ర కూడా అవసరం. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిమితులలో ఈ డ్రింక్ లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)