Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026

Vatu Tips: ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu With Insurance Companies,వరదల్లో దెబ్బతిన్న వాహనాలు.. ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు మీటింగ్.. కీలక ఆదేశాలు – chandrababu meeting with insurance companies and banks over vehicles damaged in vijayawada floods
ఆంధ్రప్రదేశ్

Chandrababu With Insurance Companies,వరదల్లో దెబ్బతిన్న వాహనాలు.. ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు మీటింగ్.. కీలక ఆదేశాలు – chandrababu meeting with insurance companies and banks over vehicles damaged in vijayawada floods

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu With Insurance Companies,వరదల్లో దెబ్బతిన్న వాహనాలు.. ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు మీటింగ్.. కీలక ఆదేశాలు – chandrababu meeting with insurance companies and banks over vehicles damaged in vijayawada floods
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



బుడమేరు బీభత్సానికి విజయవాడ వణికిపోయింది. పలు ప్రాంతాలు నీటమునిగి.. ఇప్పటికీ తేరుకోలేకున్నాయి. ఇళ్లల్లోకి చేరిన వరదనీటితో బెజవాడ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో 32 మంది మరణిస్తే.. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వర్షాలు, వరదల కారణంగా గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వేల సంఖ్యలో కోళ్లు, వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. పంటలు దెబ్బతిని సుమారుగా రెండున్నర లక్షల మంది రైతులు నష్టపోయారని అంచనా. ఇవికాక వాహనాలు అనేకం దెబ్బతిన్నాయి. వరద నీటిలో కొన్ని కొట్టుకుపోగా.. మరికొన్ని వాహనాలు చెడిపోయాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విజయవాడ కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో సీఎం సమావేశమయ్యారు.వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. వాహనదారుల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పదిరోజుల్లోగా పూర్తి చేయాలని బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు సూచించారు.

ఈ సందర్భంగా ఎన్నడూ చూడని విపత్తును విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుఫాన్లు, వరదలు గతంలో వచ్చినప్పటికీ నేటి పరిస్థితి పూర్తి భిన్నమని అన్నారు. ఆకస్మిక వరదల కారణంగా తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సర్వశక్తులు ఒడ్డుతున్నామనీ, ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందిస్తున్నామని వివరించారు. వరదల కారణంగా.. బైక్‌లు, కార్లు నీటమునిగాయని.. పలుచోట్ల దెబ్బతిన్నాయని చంద్రబాబు అన్నారు. ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా పాడైపోయాయన్న చంద్రబాబు.. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకర్లు నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని సూచించారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని సూచించారు.

ఇక వాహనదారుల క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలన్న చంద్రబాబు.. ఆన్లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తిచెయ్యాలని బీమా కంపెనీలకు సూచించారు. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాల పరిమితిని రీ షెడ్యూల్ చెయ్యాలని బ్యాంకర్లను కోరారు. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, బీమా కంపెనీలు అందరం కలిసి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలన్న చంద్రబాబు..వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్ లకు దరఖాస్తు చేయాలని చంద్రబాబు సూచించారు. లోన్లు రీషెడ్యూల్, 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చెయ్యాలనే ప్రభుత్వం ప్రతిపాదనలపై చర్చించుకుని రావాలని బ్యాంకర్లకు, బీమా కంపెనీలకు సూచించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026

Vijayawada Man Put Pesticide In Woman Mouth,ప్రేమ పేరుతో వివాహితకు ట్రాప్.. భర్తకు దూరం చేసి, గదికి పిలిపించి ఇలా చేశాడేంటి! – young man cheated a married woman in the name of love and put pesticide in her mouth in vijayawada

7 February 2026

Mulapeta Port Townships Planning,ఆ జిల్లా దశ తిరిగింది.. 3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు.. ఆ కొత్త పోర్టు దగ్గరే! – andhra pradesh government planned townships near mulapeta port

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

కుక్కలు ప్రాథమికంగా అడవి జంతువుల నుండి పరిణామం చెందినవి. అడవిలో ఉన్నప్పుడు అవి గుహల ప్రవేశ ద్వారం దగ్గర పడుకుని…

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026

Vatu Tips: ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!

7 February 2026

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026

Vatu Tips: ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.