
గత 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరుకులో అత్యధికంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాదు తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు విజయవాడలోని వరద ముంపు ప్రంతాల్లో ప్రభుత్వం సహాయ,పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు చేపట్టారు.. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యింది. 41927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించారు.. మొత్తం 171 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 36 NDRF,SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భాదితులకు ఈరోజు 3లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ·ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు. 188 బోట్లు,283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అజిత్ సింగ్ నగర్ లోని అపార్ట్మెంట్ మీద ఉన్న ప్రజలకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.. చంద్రబాబు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. మరోవైపు ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద తగ్గుముఖం పడుతోంది.

