చూస్తుండగానే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.. ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు కాలేదు.. పాన్ ఇండియన్ సినిమాకు ఈ మాత్రం ప్రమోషన్ లేకపోతే ఎలా..? ఇలా దేవరపై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే ఫుల్ మీల్స్ పెట్టేయడానికి ఫిక్సైపోయారు ఎన్టీఆర్ అండ్ టీం. ఇప్పట్నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్‌తో రచ్చకు రెడీ అవుతున్నారు. మరి దేవర ప్లానింగ్ ఏంటి..?
చూస్తున్నారుగా ఎన్టీఆర్ ఎనర్జీ.. ఇదే కదా ఇన్నాళ్లూ అభిమానులు దేవరలో మిస్సైంది అన్నది. అందుకే దేవర ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో మొదలు పెట్టారు మేకర్స్. ఇదిగో ఈ దావూది పాటతోనే ప్రమోషన్స్ జోరు పెంచారు.
ఏకంగా వీడియో సాంగ్‌నే విడుదల చేసారు మేకర్స్. దావూది అంటూ డాన్సుల్లో దంచికొట్టారు తారక్. ఈ ఒక్క పాటతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఖాయం. ఇప్పట్నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దేవర టీం. సెప్టెంబర్ 27 అంటే ఎంతో దూరంలో లేదు.
అందుకే ముందుగా ముంబై నుంచే నరుక్కొస్తున్నారు మేకర్స్. అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తమిళ నాడు, కేరళ మీదుగా.. చివరగా ఏపీ, తెలంగాణపై ఫోకస్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఇది మొదలు కానుందని తెలుస్తుంది.
ఇకపై కంటెంట్ కూడా బాగానే రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ట్రైలర్ సైతం రిలీజ్‌కు రెండు వారాల ముందే ఇస్తారని తెలుస్తుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. అలాగే సైఫ్ విలన్ కావడంతో హిందీలోనూ దేవరపై ఆసక్తి బాగానే ఉంది. మొత్తానికి దేవర ప్రమోషన్ దూకుడు మొదలైంది.






