వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని అవుసుల కుంట చెరువు దగ్గర 13 అడుగుల పొడవున్న కొండచిలువను స్నేక్ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో బంధించారు. చెరువు సమీపంలో కొండచిలువ సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించి… వెంటనే సాగర్ బృందానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న టీమ్.. కొండచిలువను విజయవంతంగా పట్టుకున్నారు. అప్పటికే ఉడుమును మింగేసిన కొండచిలువ..బందించే క్రమంలో దాన్ని కక్కేసింది. ఆ ఉడుము దాదాపు 5 అడుగల వరకు పొడవు ఉంది. ఈ సందర్భంలో కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. చెరువు ఊరికి సమీపంగా ఉండటం వల్ల చిన్నపిల్లలు చెరువు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. విషసర్పాలు, అటవీ జంతువులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Python
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..