మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అయితే ఈ వేడుకలో కన్నప్ప మూవీ డైరెక్టర్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఆయన బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
కన్నప్ప మూవీ డైరెక్టర్ పేరు ముకేశ్ కుమార్ సింగ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే. ఇప్పటివరకు బుల్లితెరపై అనేక సీరియల్స్ తెరకెక్కించారు. 2012లో రామాయణ్, 2013 -14లో మహాభారత్ సీరియల్స్ లో కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు. వీటితోపాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ చేశారు. 2008 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాకపోతే ఎక్కువగా సీరియల్స్ మాత్రమే రూపొందించారు. ఆయన గురించి ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన అద్భుతమైన సీరియల్స్ మాత్రం జనాలకు దగ్గరయ్యాయి. అంతేకాకుండా బుల్లితెరపై చాలా కాలం అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్నాయి.
ముకేశ్ కుమార్ సింగ్.. కన్నప్ప దర్శకత్వ బాధ్యతలు అందించారు మోహన్ బాబు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఆయన పనితనం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. హిందీలో ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించింది ఎక్కువగా భక్తిరస సీరియల్స్ కావడం మరో విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..