Nandamuri Balakrishna Fun With Son In Laws: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్‌తో కలిసి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లుళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ బాలయ్య చేసిన సరదా వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండే ఈ ముగ్గురు సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హైలైట్:
- అల్లుళ్లతో నందమూరి బాలయ్య సరదా సన్నివేశం
- లోకేష్‌తో ఇబ్బంది లేదంట.. చిన్నల్లుడితోనే సమస్య
- దెబ్బకు పుష్ఫను గుర్తు చేసుకున్నారు.. వీడియో వైరల్

పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు
కావూరి సాంబశివరావు 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అంతేకాదు యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కావూరి సాంబశివరావు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌కు స్వయానా తాత అవుతారు. అందుకే నారా, నందమూరి కుటుంబాల నుంచి పలువురు కావూరి షష్టిపూర్తి వేడుకలకు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.