సినిమా ఇండస్ట్రీలో మరో సారి డ్రగ్స్ జాడలు బయట పట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ఒక ఫేమస్ నటుడు
డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం చెన్నైలోనే స్థిరపడిన ఆ హీరోను చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అనంతరం అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఐడీఎంకే మాజీ నేత నుంచి నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హీరోను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.