Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

11 February 2026

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap High Court Hearing On Conocarpus Trees Pil,ఏపీలో ఆ చెట్లు డేంజర్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నరికివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court hearing on pil filed to stop chopping conocarpus trees
ఆంధ్రప్రదేశ్

Ap High Court Hearing On Conocarpus Trees Pil,ఏపీలో ఆ చెట్లు డేంజర్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నరికివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court hearing on pil filed to stop chopping conocarpus trees

.By .5 September 2024No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap High Court Hearing On Conocarpus Trees Pil,ఏపీలో ఆ చెట్లు డేంజర్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నరికివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court hearing on pil filed to stop chopping conocarpus trees
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో కోనో కార్పస్ చెట్ల నరికివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కోనో కార్పస్‌ చెట్లతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 645 చెట్లను కొట్టేసి.. వాటి స్థానంలో దేశీ మొక్కలు నాటుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. కోనో కార్పస్‌ చెట్లపై శాస్త్రీయ పరిశోధన ఏదీ జరగలేదని.. రాష్ట్రంలో ఆ చెట్ల నరికివేయకుండా అడ్డుకోవాలని పిటిషన్‌దారులు కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. ఈ కోనో కార్పస్ చెట్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణను నవంబరు 6కి వాయిదా వేసింది.కోనో కార్పస్‌ చెట్లను కొట్టేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మరో ఇద్దరు ప్రొఫెసర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోనో కార్పస్‌ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలుచేసి ప్రత్యామ్నాయ ప్రదేశంలో మొక్కలు నాటేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును పిల్‌లో కోరారు. కోనో కార్పస్ చెట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో కొట్టేయడాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారని పిల్‌లో ప్రస్తావించారు.

ఇటీవల ఏపీలో వన మహోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కోనో కార్పస్ చెట్లు, మొక్కులు చాలా డేంజర్ అన్నారు. కోనోకార్పస్‌ వంటి మొక్కల వల్ల అనార్థాలు ఉన్నాయని.. ఎలాంటి ఉపయోగాలు లేవన్నారు. ఈ కోనోకార్పస్‌ మొక్కలను పశువులు తినవు.. పక్షులు గూడుపెట్టుకోవని చెప్పుకొచ్చారు. ఈ చెట్లకు క్రిమికీటకాలు రావని.. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను పెంచడం మంచిది కాదన్నారు. ఈ చెట్లు, మొక్కలు ఉన్న చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని.. ఇప్పటికే అరబ్‌ దేశాలే కోనో కార్పస్‌ మొక్కల్ని నిషేధించారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కల స్థానంలో దేశీయ మొక్కల్ని నాటాలని పిలుపునిచ్చారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026

Ambati Rambabu: అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!

11 February 2026

నారా లోకేష్ కొత్త కార్యక్రమం.. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్.. – ap minister nara lokesh plans to hold dinner meetings with mlas

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

11 February 2026

బార్బతి కర్రీ గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి లాంగ్ బీన్స్ కూర. దీన్ని ఒకసారి చేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా…

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

11 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

11 February 2026

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.