వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
తెలుగుతోపాటు హిందీలో స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది.
టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.
కానీ చాలాకాలంగా ఈ బ్యూటీ తెలుగులో నటించలేదు. చివరిసారిగా కొండపొలం చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
అటు హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే ఓటీటీలోక అడుగుపెడుతుంది. వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయ్యింది.
అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసే ఫోటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







