కంగనను, కాంట్రవర్శీకి అంత విడదీయరాని బంధం ఏంటి? అనే చర్చ మరోసారి మొదలైంది. ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు చెక్ పెట్టేస్తానని చెప్పిన కంగన రనౌత్..
ఇప్పుడు ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వకపోయినా, ఆల్రెడీ చేసిన సినిమాతో మాత్రం వార్తల్లో ఉంటున్నారు. నార్త్ తలైవి కంగన రనౌత్ గురించి వార్తలు జోరందుకున్నాయి నార్త్ మీడియాలో.
ఆమె నటించి, డైరక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతుందన్నది న్యూస్. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు కంగన.
తీరా ఇప్పుడు సెన్సార్ సమస్యల్లో పడింది ఎమర్జెన్సీ మూవీ. సినిమాల్లో కంటిన్యూ అయినా, కాకపోయినా కంగనకి ఎమర్జెన్సీ సినిమా చాలా కీలకం. నిర్మాతగానే కాదు, నటిగానూ ఆమె కెరీర్‌లో కీలకమైన సినిమా ఇది.
అటు సినిమాల్లో కొనసాగాలంటే హిట్ కంపల్సరీ. ఒకవేళ ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నా ఫ్లాప్ సినిమాతో ఎండ్ కార్డు వేయడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి.. సో, ఎటొచ్చీ కంగనకు ఎమర్జెన్సీ రిజల్ట్ ఇంపార్టెంట్ అన్నమాట.
రీసెంట్‌గా నార్త్ తో పోలిస్తే సౌత్ మీదే ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ సినిమాలు చేశారు కంగన. అయితే ఇక్కడ కూడా ఆమెకు సక్సెస్ రాలేదు. అటు నార్త్ లోనూ విజయం పలకరించలేదు..
అందుకే ఎలాగైనా ఎమర్జెన్సీతో గట్టిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సెన్సార్ గడప దాటే సమయానికి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరకాలి.. కంగన ముందున్న టాస్కుల్లో… అది కూడా చాలా ఇంపార్ట్ అన్నమాట.








