మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఫస్ట్ పార్ట్ దేవర చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. దేవర సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు దేవర సినిమాపై ఇప్పటివరకు ఉన్న ఎక్స్పెక్టెషన్స్ అన్నింటినీ మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన మూడో సాంగ్ దావూదీ.. దావూదీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో తారక్, జాన్వీ కపూర్ డాన్స్ అదరగొట్టేశారు. చాలా కాలం తర్వాత వింటెడ్ తారక్ ను చూసి ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్ట్ లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ పాటకు అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. ఇక ఎప్పటిలాగే డాన్స్ అందరగొట్టేశారు తారక్. అయితే ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తారక్ ఎంత బాధను అనుభవించారో చెప్పుకొచ్చారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. కండరాల నొప్పి.. చేతి గాయం బాధపెడుతున్నా ఈ పాటకు ఇంత అద్భుతంగా డాన్స్ చేశారంటే ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
“కండరాల నొప్పి, గాయంతో బాధపడుతున్నా కూడా ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటకు ఇంత ఈజీగా స్టైలీష్ గా తారక్ డ్యాన్స్ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నీకు హ్యాట్సాఫ్” అంటూ దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. తారక్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. సాధారణంగా ఇలాంటి స్టెప్పులు వేయడమే కష్టం.. అలాంటిది గాయం వేధిస్తున్నా ఇంత ఈజీగా డ్యాన్స్ చేశాడంటే.. సినిమాపై తారక్ కు ఇష్టం తెలుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను నకాష్ అజీజ్, అకాసా ఆలపించారు.
ట్వీట్..
Despite muscle spasm ,injury and pain @tarak9999 bro danced this pacy song #Daavudi effortlessly stylish .Hats off 👏👏 #Devara @SivaKoratala @RathnaveluDop @anirudhofficial #Janhvi Kapoor #sekar master @ramjowrites @Yugandhart_ @NTRArtsOfficial… pic.twitter.com/kZaONi1Hed
— Rathnavelu ISC (@RathnaveluDop) September 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

