హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు TS07 HW 5858 అనే నంబర్ గల బెలినో కారు లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పెద్ద అంబర్ పెట్ నుండి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

