అమరావతి, సెప్టెంబర్ 9: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యా సంస్థలు, కార్యాలయాలకూ అడపా దడపా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 9) కూడా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్ధుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ (పునరావాస కేంద్రాలు & ముంపు ప్రాంతాలలో పాఠశాలలు), బాపట్లలోని కొన్ని మండలాల్లోని విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

