Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Heavy Rains,ఏపీపై వాయుగుండం తీవ్ర ప్రభావం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ప్రజలకు అలర్ట్ – imd weather report that heavy rains and flood alert in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Heavy Rains,ఏపీపై వాయుగుండం తీవ్ర ప్రభావం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ప్రజలకు అలర్ట్ – imd weather report that heavy rains and flood alert in andhra pradesh

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Heavy Rains,ఏపీపై వాయుగుండం తీవ్ర ప్రభావం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ప్రజలకు అలర్ట్ – imd weather report that heavy rains and flood alert in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాలపూర్‌ (ఒడిశా)కు 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం ఉదయంలోగా ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశముందని.. రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళుతుందని భావిస్తున్నారు.ఈ వాయుగుండం ప్రభావంతో.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని.. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని.. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని.. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని వర్షాలతో.. విశాఖలోని గోపాలపట్నంలో భారీ కొండచరియ విరిగిపడింది. రెండు ఇళ్లు ప్రమాదకరంగా మారడంతో.. అప్రమత్తమైన అధికారులు వెంటనే సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.

వాయుగుండం ప్రభావంతో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నమోదైన వర్షపాతాన్ని చూసి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇక ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు వంశధార, నాగావళి నదులకు వరద పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్రలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఆదివారం పలు విమానాలు ఆలస్యం కాగా.. ఒక సర్వీసు రద్దు చేశారు. బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఎయిర్‌ ఏషియా విమానం ఉదయం 7.55 గంటలకు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12:10 గంటలకు వచ్చింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ఉదయం 11:25 రావాల్సిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకుంది. అలాగే వాతావరణం అనుకూలించక పోవడంతో కౌలాలంపుర్‌ ఎయిర్‌ ఏషియా విమానాన్ని రద్దు చేశారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు

10 June 2026

Andhra Pradesh Rains,ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్.. – apsdma weather forecast moderate rain alert for several districts of andhra pradesh on thursday

10 June 2026

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

చేపలు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ భూ ప్రపంచం మీద అనేక రకాల చేపలు ఉన్నాయి. చాలా చిన్నవి,…

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026

Eggs: కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.