Andhra Pradesh No Non Teaching Tasks For Teachers: ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది! ఇకపై పాఠశాల పనులకు సంబంధం లేని ఇతర పనుల్లో టీచర్లను భాగస్వామ్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు టీచర్లకు ఇతర పనులు అప్పగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పీ-4 కార్యక్రమాన్ని తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీసీ వసతి గృహాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
హైలైట్:
- ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఊరట
- ఇకపై ఆ పనులు చేయక్కర్లేదు
- ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు

ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయులకు పీ-4 కార్యక్రమాన్ని తప్పనిసరి చేయడాన్ని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) వ్యతిరేకిస్తోంది. పీ-4లో నిర్బంధ రిజిస్ట్రేషన్లను బహిష్కరించాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులపై కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. దత్తత తీసుకునే అంశం ఐచ్ఛికంగా ఉండాలని.. కానీ నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఏలూరు జిల్లా విద్యాధికారి సోమవారం సాయంత్రంలోపు పీ-4లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడాన్ని వారు ఖండించారు. ఉపాధ్యాయులు వేరే కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు ఫ్యాప్టో నేతలు. ఎవరైనా స్వచ్ఛందంగా దత్తత తీసుకుంటే సంతోషిస్తామని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
ఎన్ని సార్లైనా వస్తాను.. ఐదేళ్లుగా పోరాంట చేస్తున్నా: లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఆగస్టు 6 నుంచి మూడు రోజుల పాటు ఫ్రెషర్స్ డే వేడుకలు జరుగుతాయి. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి ఈ వేడుకలు ఉపయోగపడతాయి
అంటున్నారు. అన్ని తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీల సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారని మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా మంగళవారం నుంచి అక్టోబరు 10 వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు.


