సంపాదించిన సొమ్ములో కొద్దిమేరకు పొదుపు చేస్తే.. భవిష్యత్తు అవసరాలకు అస్సలు లోటుండదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అయితే లాభాలు వస్తాయి. కానీ రిస్క్ ఎక్కువ. అయితే రిస్క్ లేకుండా భద్రతతో కూడుకున్న రిటర్న్స్ కావాలంటే.. ప్రభుత్వ పధకాలే మేలు. అందులో ఒకటే ఈ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకం. ఇందులో నెలకు రూ. 1500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ ముగిసే సమయానికి రూ. 5 లక్షలు మీ సొంతం.
పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీని ఇచ్చే పధకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో పెట్టుబడి పెడితే.. ఇన్వెస్ట్మెంట్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున మెచ్యూరిటీ డేట్ పెంచుకుంటూ పోవచ్చు.
ఈ పీపీఎఫ్ స్కీంలో ప్రతీ ఏడాది కనీసం రూ. 500 నుంచి గరిష్టం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టకపోతే.. అకౌంట్ ఫ్రీజ్ అయినట్టే. బ్యాంకుతో పాటు, పోస్టాఫీసులో కూడా మీరు పీపీఎఫ్ ఖాతాను తెరుచుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌పై అధిక వడ్డీ మాత్రమే పన్ను ప్రయోజనాలు, గ్యారెంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి.
ఈ పధకంలో 5 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.18,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మొత్తం రూ. 2,70,000 జమ అవుతుంది.
ప్రస్తుతమున్న 7.1 శాతం వడ్డీ రేటుతో చూస్తే.. మీకు ఆదాయంపై 2,18,185 వడ్డీ లభిస్తుంది. జమ అయిన మొత్తంతో పాటు వడ్డీని కలుపుకుంటే.. మొత్తం రూ. 4,88,185 మీ సొంతమవుతుంది. అంటే దాదాపుగా రూ. 5 లక్షలు మీ చేతికి రూ. 5 లక్షలు వస్తాయి. అధిక ఆదాయం కోసం ఈ పధకాన్ని మరికొన్ని ఏళ్లు పొడిగించుకోవచ్చు.






