
గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏడుగురి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.
దివాన్‌చెరువు చిరుత టెన్షన్
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు అభయారణ్యంలో సంచరిస్తున్న చిరుత టెన్షన్ కొనసాగుతోంది. చిరుత జాడ ఇంకా దొరకలేదు.. ఐదు రోజులుగా దానిని బంధించేందుకు అటవీ శాఖాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 100 మంది అటవీ, పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత పాదముద్రలు గుర్తించేందుకు రంపచోడవరం ప్రాంతం నుంచి నిపుణులు నలుగురితో ఓ టీమ్‌ను తీసుకొచ్చారు. అదనరంగా మరో నాలుగు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా.. చిరుత పాదముద్రలకు సంబంధించి ఫోటోలను అటవీశాఖ అధికారులు విడుదల చేశారు.
దివాన్‌చెరువు అభయారణ్యంలో పందులు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే చిరుతకు ఆహారం సమృద్ధిగా ఉండొచ్చని, అందుకే సంచారం తక్కువగా ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతం వెనుక ఉన్న శ్రీరాంపురం వెళ్లే రోడ్డులో వేపలదిబ్బ దగ్గర చిరుత పాదముద్రలున్నాయని సమాచారం వచ్చింది. అక్కడ నాలుగు పాదముద్రలు పక్క పక్కనే ఉండటంతో.. రెండు చిరుతులు తిరుగుతున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఆ పాదముద్రలను పరిశీలించి.. అవి ఒక జాతి కుక్కకు చెందినవని గుర్తించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమీపంలోని ఓ పండ్ల తోటలో ఉన్న రెండు బెల్జియం దేశానికి చెందిన జాతి కుక్కల పాదముద్రలని తేల్చారు.

