Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Board Still Pending Brahmotsavam,చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి.. బోర్డు లేకుండానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..? – ttd trust board still pending and what about tirumala srivari brahmotsavam 2024
ఆంధ్రప్రదేశ్

Ttd Board Still Pending Brahmotsavam,చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి.. బోర్డు లేకుండానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..? – ttd trust board still pending and what about tirumala srivari brahmotsavam 2024

.By .11 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Board Still Pending Brahmotsavam,చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి.. బోర్డు లేకుండానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..? – ttd trust board still pending and what about tirumala srivari brahmotsavam 2024
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలో సుందరీకరణ పనులు వేగవంతంంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు టీటీడీ పాలకమండలి లేకుండానే జరగబోతున్నాయనే చర్చ జరుగుతోంది. మరో మూడు వారాల్లో బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు వేయలేదు. దీంతో ఈసారికి అధికారులే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గత నెలలో పాలకమండలి అంశం తెరపైకి వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. బ్రహ్మోత్సవాలలోపు టీటీడీ పాలకమండలి నియామకం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. వర్షాలు ఉత్తరాంధ్రతో పాటూ కోస్తాలోని మరికొన్ని జిల్లాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు.. ఇలా అధికార యంత్రాంగం మొత్తం ఈ వరద సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వరదల వాటిల్లిన ఆస్తి నష్టం, పంట నష్టాన్ని అంచనాలు వేసే పనుల్లో ఉన్నారు. మరోవైపు గోదావరికి వరద పెరుగుతోంది. కాబట్టి మరో రెండు వారాల పాటూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదలకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు.

దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పాలకమండలి లేకుండానే నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీటీడీ బాధ్యతలను ఈవో జే శ్యామలరావు చూసుకుంటున్నారు.. ఆయనతో పాటూ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా టీటీడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. పాలకమండలి గురించి పట్టించుకోకుండా.. బ్రహ్మోత్సవాల పనులను ఈ అధికారులిద్దరూ వేగవంతం చేశారు.

ప్రతి ఏటా బ్రహోత్సవాలకు ముందు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.. బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటూ ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పాలకమండలి ఏర్పాటుకాకపోవడంతో అధికారులే ఆ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు ముఖ్యమంత్రిని టీటీడీ తరఫున పాలకమండలి ఛైర్మన్, ఈవోలు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకవేళ శ్రీవారి బ్రహోత్సవాాలు ప్రారంభమయ్యే సమయానికి టీటీడీ పాలకమండలి నియామకం కనుక జరగకపోతే.. టీటీడీ ఈవోనే ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించే అవకాశం ఉంది.

పాలకమండలి నియమాకం ఆలస్యానికి కారణం ఏంటి?

కూటమి ప్రభుత్వానికి టీటీడీ పాలకమండలి కూర్పు మొదటి నుంచి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే.. టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇద్దరు, ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి.. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ తెలుగు టాప్ న్యూస్ ఛానల్ అధినేత పేరు కూడా తెరపైకి వచ్చింది.. మళ్లీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే కూటమి ప్రభుత్వం పాలకమండలి నియామకాన్ని ఎటూ తేల్చలేకపోయింది.

టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యుల పదవుల కోసం కూటమి ప్రభుత్వంలో పోటీ పెరిగింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రభుత్వంలో ఉండటంతో.. మూడు పార్టీల నుంచి ఆశావహులు కూడా ఎక్కువగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారి ప్రచారం జరగ్గా.. ఆయన మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు టీటీడీ ఛైర్మన్ పోస్టు గురించి ఒకరిద్దరు తనను స్పందించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ కూడా టీటీడీ ఛైర్మన్ పదవి కోరిందనే టాక్ వినిపించింది. ఇలా టీటీడీ ఛైర్మన్ పదవితో పాటుగా పాలకమండలి సభ్యుల పదవులకు పోటీ పెరగడంతో.. టీటీడీ పాలకమండలి నియామకం ఆలస్యమవుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవులు ఏవైనా సరే.. మూడు పార్టీలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి. మూడు పార్టీల నేతలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. ఒకటి, రెండుసార్లు సమావేశాలు నిర్వహించినా ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదంటున్నారు. అందుకే టీటీడీ పాలకమండలి, మిగిలిన ప్రముఖ ఆలయాల పాకలమండళ్ల నియామకంతో పాటుగా.. వివిధ కార్పొరేషన్లు, నామినేటేడ్ పోస్టుల భర్తీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నామినేటెడ్ పదవుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు టీటీడీ పాలకమండలి లేకుండానే జరుగుతాయనే వాదన వినిపిస్తోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు

10 June 2026

Andhra Pradesh Rains,ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్.. – apsdma weather forecast moderate rain alert for several districts of andhra pradesh on thursday

10 June 2026

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి చిత్రపటం, ప్రతి…

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026

ఈరోజు ఇరాన్ పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్ | trump Issues Sensational Warning to Tehran: US Will Launch Massive Attacks on Iran Today Trump iran

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.